5 bank holidays in november 2023 : ప్రతీనెలలో వీకెండ్స్తోపాటు కొన్ని పండగలు వస్తుంటాయి. ఒక్కోసారి ఇవి కలిసి రావడంతో.. బ్యాంకులకు వరుస సెలవులు వస్తుంటాయి. అయితే.. ఈ సెలవుల్లో కొన్ని జాతీయ సెలవులు ఉంటాయి. అంటే.. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. కానీ.. కొన్ని సెలవులు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతాయి. దీంతో.. ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి, ఏ రోజున.. ఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
11 నవంబర్ :
నవంబరు 11 రెండవ శనివారం అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ప్రతీ నెలలో రెండవ, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవు. కాబట్టి నవంబర్ 11 తేదీన దేశంలోని అన్ని బ్యాంకులూ మూసి ఉంటాయి.
12 నవంబర్ :
12 నవంబర్ తేదీన ఆదివారం వస్తోంది. అంతేకాదు.. ఈ రోజున దీపావళి పర్వదినం కూడా. దేశం మొత్తం ఈ పండగను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. అంటే.. వరుసగా రెండు రోజులు జాతీయ సెలవులు.
Bank Holidays In November 2023 : నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
నవంబర్ 13 :
నవంబర్ 13 తేదీన సోమవారం అవుతోంది. త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ రోజున (నవంబర్ 13), గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సోమవారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.