కుక్క బెల్టును భార్య మెడకు బిగించి హత్య(husband kills wife) చేశాడో బ్యాంకు ఉద్యోగి. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన బంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో జరిగింది.
కుక్క బెల్టును భార్య మెడకు బిగించి హత్య చేసిన బ్యాంకు ఉద్యోగి బిప్లవ్ పరీదా వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగిగా పనిచేసేవాడు. తన భార్య ఇప్స ప్రియదర్శినితో(35) కలిసి బామున్పొరా ప్రాంతంలో నివసిస్తున్నాడు. స్థానికంగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అసిస్టేంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2019లోనే కటక్‌కు చెందిన ఇప్సను వివాహం చేసుకున్నాడు. అయితే.. వీరివురి మధ్య చిన్న చిన్న తగాదాలు అప్పుడప్పుడు జరుగుతుండేవి. కానీ ఈసారి మాత్రం బిప్లవ్ సహనం కోల్పోయాడు. కుక్క బెల్టును భార్య మెడకు బిగించి హత్య చేశాడు.
పోలీసులకు లొంగిపోయిన నిందితుడు 'కుటుంబంపై శ్రద్ధలేదు..'
హత్యానంతరం పోలీసు స్టేషన్‌కి వెళ్లి నేరాన్ని ఒప్పుకున్నాడు బిప్లవ్. 'నా భార్యకు కుటుంబ జీవితంపై శ్రద్ధలేదు. షాపింగ్‌తో అనవసర ఖర్చులు చేస్తోంది. వాటిని నేను భరించలేకపోయాను. సెలవు దినాల్లో టూర్లకు వెళ్లాలని ఇబ్బంది పెడుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు అంటూ వృథా ఖర్చు చేయించింది. ఇంటి పనులన్నీ నేనే భరించాల్సి వస్తోంది. నేను ఓపికను కోల్పోయాను,' అని చెప్పుకొచ్చాడు.
ఇప్స మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:కూతురిపై తండ్రి అత్యాచారం.. అవమానంతో కొడుకు ఆత్మహత్య
ముగ్గురు పిల్లల్ని డ్యాంలో తోసేసి.. భార్యను గొడ్డలితో నరికి..