మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మూడు రోజుల్లో 40 మంది.. సైబర్ మోసాల బారిన పడ్డారు. ఫేక్ లింక్‌లను క్లిక్ చేసి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. బ్యాంక్ కేవైసీని అప్డేట్ చేయాలని.. లేకపోతే ఖాతాలు బ్లాక్ అవుతాయనే మెసేజ్‌తో ఈ లింక్‌లు వస్తున్నాయి. తొందరపడి ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారంతా డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల్లో మహారాష్ట్ర టీవి నటి కూడా ఉన్నారు.
ముంబయి పోలీసులు తరుచుగా ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు ఈ మోసాలకు గురువుతూనే ఉన్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు. మొత్తం 40 మందికిపైగా సైబర్ మోసాలకు గురై.. డబ్బులు పోగొట్టున్నట్లు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఎంపిక చేసిన నంబర్లకు సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ మెసేజ్‌ను పంపిస్తున్నారు. కేటుగాళ్లు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే.. కేవైసీ/ పాన్‌కార్డ్ వివరాలు అప్డేట్ చేసుకోవాలనే సందేశం వస్తోంది. లేకపోతే బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. అది క్లిక్ చేసిన తరువాత ఓ ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అనంతరం ఆన్లైన్ దరఖాస్తులో వారి వ్యక్తిగత వివరాలు.. కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ నింపమని చెబుతారు. దీంతో వారి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.