సరిహద్దుల గుండా భారత్లోకి ప్రవేశించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీ స్మగ్లర్లను(bangladesh cattle smugglers) తరిమికొట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో స్మగ్లర్లకు, బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దుండగులను మట్టుబెట్టాయి. ఈ సంఘటన(cattle smuggling india-bangladesh border) బంగాల్ కూచ్ బెహార్ జిల్లాలోని భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో(india-bangladesh border) శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.
వెదురు బొంగులను ఉపయోగించి సరిహద్దు కంచె దాటిన దుండగులు.. పశువులను అవతలివైపునకు(cattle smugglers) చేరవేసే ప్రయత్నం చేశారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారిని గమనించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించి.. చెదరగొట్టేందుకు ముందుగా జవాన్లు ప్రాణాపాయం లేని మందుగుండు సామగ్రిని వినియోగించినట్లు పేర్కొన్నారు. అయితే.. బీఎస్ఎఫ్ దళాలపై వారు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారని, దాంతో కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు స్మగ్లర్లు హతమైనట్లు వెల్లడించారు.