క్రానిక్ కిడ్నీ డిజార్డర్‌తో (సీకేడీ) బాధపడుతున్న వ్యక్తికి చెన్నైలోని మద్రాసు మెడికల్ మిషన్ (ఎంఎంఎం) ఆసుపత్రి వైద్యులు. ఆయన ఆరోగ్యం సక్రమంగా ఉందని వైద్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీకేడీతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు పని చేయడం మానేస్తాయని.. డయాలసిస్‌పై ఆధారపడాల్సి వస్తుందన్నారు.
41 ఏళ్ల రోగి అధిక రక్తపోటు, సీకేడీ సమస్యలతో బాధపడుతూ ఎంఎంఎం ఆసుపత్రిలో చేరారని, అంతకుముందు ఆయనకు వేరే ఆసుపత్రుల్లో నిర్వహించిన రెండు కిడ్నీ శస్త్ర చికిత్సలు విజయవంతం కాలేదన్నారు. రోగికి కరోనరీ ఆర్టెరీ సమస్య ఎదురైందని.. 3 నెలల క్రితం ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలున్న రోగికి జులై 10న 'అన్ కన్వెన్షనల్ ట్రాన్స్‌పెరిటోనియల్' విధానంలో శస్త్రచికిత్స చేశామని తెలిపారు. గతంలో అమర్చిన వాటితో కలిపి ఆయన శరీరంలో నాలుగు కిడ్నీలు ఉన్నాయని.. వాటి మధ్య ఐదోది ఏర్పాటు చేయడం సవాలుగా మారిందని వివరించారు.