తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ, దీదీలకు 2,600కిలోల మామిడి పండ్లు'

భారత్​తో స్నేహా బంధానికి చిహ్నంగా ప్రధాని నరేంద్ర మోదీకి 2,600 కిలోల మామాడి పండ్లను బహుకరించారు బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా. వాటిని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా పంపించినట్లు సమాచారం.

PM Hasina gifts mangoes to Modi
మోదీకి మామిడి పండ్లు

By

Published : Jul 5, 2021, 10:09 PM IST

భారత్​తో మైత్రికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మామిడి పండ్లు పంపించారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. 2,600 కేజీల హరీభంగ రకం మామాడి పండ్లను బహుకరించారు. రంగాపుర్​కు చెందిన వీటిని భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, బంగాల్​ సీఎం మమతా బెనర్జీలకు కూడా హసీనా పంపించినట్లు తెలుస్తోంది.

షేక్ హసీనాతో మోదీ (ఫైల్ ఫొటో)

ఈ మేరకు 260 కార్టన్ల మామిడి పండ్లతో ఓ ట్రక్కు ఆదివారం బంగ్లాదేశ్ సరిహద్దు దాటిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. భారత ఉపఖండంలో మామిడి పండ్ల దౌత్యం సంప్రదాయంగా వస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షులు జియా ఉల్​ హక్, పర్వేజ్ షరీఫ్​ కూడా భారత్​కు మామిడి పండ్లు పంపినవారిలో ఉన్నారు.

ఇదీ చూడండి:మోదీకి మామిడి పండ్లు పంపిన సీఎం

ABOUT THE AUTHOR

...view details