తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్కులు, కరోనా కిట్లతో బాబా ఆలయ అలంకరణ - కరోనా మూడో దశ

బెంగళూరులోని ఓ సాయిబాబా ఆలయాన్ని కరోనా మాస్కులు, పోషక పదార్థాలతో అలంకరించారు నిర్వాహకులు. గురు పౌర్ణమి సందర్భంగా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

temple decorated with Corona medicine
గురు పౌర్ణమి

By

Published : Jul 24, 2021, 8:59 PM IST

Updated : Jul 24, 2021, 10:24 PM IST

కరోనా ఔషధాలు, మాస్కులతో సాయి బాబా ఆలయ అలంకరణ

కర్ణాటక బెంగళూరులోని ఓ బాబా ఆలయాన్ని వినూత్నంగా అలంకరించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేశారు అక్కడి ఆలయ నిర్వాహకులు. జేపీ నగర్​లో ఉన్న శ్రీ సత్య గణపతి సాయి కోవెలను 'గురు పౌర్ణమి' సందర్భంగా కరోనా మాస్కులు, ఔషధాలు, పోషక పదార్థాలతో అలంకరించి అబ్బురపరిచారు.

సాయి బాబా

ఇందుకోసం 3 లక్షల పిల్స్​, 10 వేల మాస్కులు, 2 వేల శానిటైజర్లను ఉపయోగించారు.

కరోనా కిట్ల అలంకరణలో బాబా

కరోనా మూడో దశపై అవగాహన కల్పించేందుకే ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు ఆలయ ట్రస్టీ రామ్​ మోహన్​ రాజ్​ తెలిపారు. కిట్లను మరో నాలుగు రోజుల్లో ప్రజలకు అందజేయనున్నట్లు వెల్లడించారు.

మాస్కులు, ఆహార పదార్థాలతో
పోషకాహార పదార్థాలతో

ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఆలయానికి విచ్చేశారు.

ఆలయానికి విచ్చేసిన ఎంపీ తేజస్వీ సూర్య

రూ.లక్షలు ఖర్చు పెట్టి వ్యర్థంగా మిగిలిపోయే అలంకరణలు చేయడం కన్నా ప్రజలకు ఉపయోగపడేలా చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.

మాస్కులతో బాబా నామం

ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.

పూలు, దీపాల వెలుగుల్లో

ఇదీ చూడండి:Guru Purnima : గురుపరంపరకు ఆద్యుడు.. వ్యాసభగవానుడు

Last Updated : Jul 24, 2021, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details