Heroin Capsules: 79 హెరాయిన్ క్యాప్సుళ్లను మింగి, కడుపులో దాచి స్మగ్లింగ్‌కు యత్నించిన ఓ విదేశీయుడు అరెస్టయ్యాడు. కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు అతడు పట్టుబడ్డాడు. కేజీ బరువున్న ఈ మాదకద్రవ్యాలు దాదాపు రూ.7కోట్లు విలువ చేస్తాయని సమాచారం.
'వీడొక్కడే' సీన్ రిపీట్- కడుపులో హెరాయిన్ క్యాప్సుల్స్‌తో.. - heroin smuggling
Heroin Capsules: తమిళ నటుడు సూర్య నటించిన 'వీడొక్కడే' సినిమా గుర్తుందా? అందులో కొందరు వ్యక్తులు.. మాదక ద్రవ్యాలను కడుపులో దాచి విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. హెరాయిన్ క్యాప్సుళ్లను పొట్టలో దాచి తరలించేందుకు యత్నించిన ఓ విదేశీయుడిని అరెస్టు చేశారు అధికారులు.
heroin
నిందితుడు ఉగాండ పౌరుడు అని అధికారులు తెలిపారు. ఉగాండ నుంచి షార్జా మీదుగా బెంగళూరు చేరుకున్నట్లు వెల్లడించారు. అతడిని అడ్డుకొని తనిఖీ చేయగా కడుపులో మాదకద్రవ్యాలను కనుగొన్నారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత.. అతడి నుంచి ఈ క్యాప్సుళ్లను బయటకు తీశారు. ఇలా కడుపులో దాచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం బెంగళూరులో తొలిసారని చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు.. జుడీషియల్ కస్టడీకి తరలించారు.