తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సిగ్నల్ జంప్ చేశా.. ఫైన్​ కట్టొచ్చా?'.. బిర్లా​ ట్వీట్​కు పోలీసుల షాకింగ్ రిప్లై - బెంగళూరు ట్రాఫిక్​ నిబంధనలు

పోలీసులకు, కెమెరాకు చిక్కకుండా సిగ్నల్ జంప్​కు యత్నాలు! ఎన్ని చలానాలు వచ్చినా పెండింగ్​లోనే పెట్టి షికార్లు!.. చాలా మంది చేసే పనులే ఇవి. కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

BENGALURU MAN CAME FORWARD TO PAY FINE FOR TRAFFIC VIOLATION
BENGALURU MAN CAME FORWARD TO PAY FINE FOR TRAFFIC VIOLATION

By

Published : Sep 29, 2022, 7:22 PM IST

"ప్రియమైన బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులారా.. శాంతినగర్ బస్టాండ్ దగ్గర నిన్న పొరపాటున ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశా. నేను స్వచ్ఛందంగా ఫైన్​ కట్టేయొచ్చా?" అంటూ పోలీసులకు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్​కు పోలీసులు ఇచ్చిన జవాబు కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏమైందంటే..

బాలకృష్ణ బిర్లా అనే వ్యక్తి బెంగళూరులో ఉంటారు. ఏదో పనిపై ఈనెల 27న తన వాహనంలో బయటకు వెళ్లారు. హడావుడిలో చూసుకోకుండా శాంతినగర్​ బస్టాండ్​ దగ్గర సిగ్నల్ జంప్ చేశారు. కానీ.. తప్పు చేశానన్న భావన ఆయన్ను వెంటాడింది. ఇంటికి వచ్చినా ప్రశాంతత లేదు. అందుకే ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నారు బాలకృష్ణ బిర్లా.

బాలకృష్ణ బిర్లా

బుధవారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక హ్యాండిల్​ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు బాలకృష్ణ. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ నేరానికి పాల్పడినందుకు స్వచ్ఛందంగా జరిమానా కట్టేస్తానని ముందుకొచ్చారు. గురువారం ఉదయం ఈ బిర్లా ట్వీట్​కు స్పందించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. "చలానా వచ్చాక మీరు ఫైన్ కట్టేయొచ్చు" అని రిప్లై ఇచ్చారు.

బాలకృష్ణ బిర్లా ట్వీట్​
బాలకృష్ణ బిర్లా ట్వీట్​కు బెంగళూరు ట్రాఫిక్​ పోలీసుల​ రిప్లై

ఇవీ చదవండి:'ఇసుక' దొంగల ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ

ABOUT THE AUTHOR

...view details