Bangalore Drugs News: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. నిందితుడు నైజీరియాకు చెందిన థామస్ కౌల్గా గుర్తించిన పోలీసులు.. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్ పిల్స్, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన పాలపొడి ప్యాకెట్లలో నిందితుడు గంజాయిని సరఫరా చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.
థామస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు అంజుమ్ జంగ్ అనే మహిళకు నోటీసులు పంపారు. ప్రెస్టీజ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజుమ్.. నిందితుడు వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేదని పోలీసులు తెలిపారు.