అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి మంటలను ఆర్పేందుకు ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తున్న రోసెన్‌బర్ సంస్థ.. అత్యాధునిక వ్యవస్థతో కూడిన అగ్నిమాపక యంత్రాలను తయారు చేసింది. ముఖ్యంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలికి వేగంగా చేరుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను రూపొందించింది(bangalore airport news). అలాంటి రోసెన్‌బర్ అగ్నిమాపక యంత్రాలను దక్షిణాసియాలోనే తొలిసారిగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేశారు. వీటిని నడిపేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రోసెన్‌బర్ సిమ్యులేటర్‌ను కూడా ఏర్పాటుచేశారు.
55 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో ఉండే ఈ సిమ్యులేటర్‌లో రోసెన్‌బర్ అగ్నిమాపక యంత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల నిజమైన రోసెన్‌బర్ అగ్నిమాపక వాహనాలు నడిపినట్లే ఉంటుంది. సిబ్బందికి మెరుగైన మెళకువలు నేర్పేందుకు సహకరిస్తుంది. ఈ సిమ్యులేటర్‌లో ఏర్పాటు చేసిన స్టీరింగ్, ఇతర వ్యవస్థల ద్వారా రోసెనబర్ అగ్నిమాపకయంత్రం కంట్రోలింగ్ వ్యవస్థను అవగాహన చేసుకోవచ్చు. వీటిని ఆపరేట్ చేస్తూ ఘటనా స్థలంలో మంటలు అర్పేలా పూర్తిస్థాయిలో శిక్షణ పొందవచ్చు(rosenbauer firefighting simulator).