Bandlaguda Laddu Auction 2023 బండ్లగూడలో రూ.1.20 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ Bandlaguda Laddu Auction 2023 : హైదరాబాద్ బండ్లగూడలోని వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్మండ్ విల్లాలోని గణేశ్ లడ్డూ(Bandlaguda Laddu)ని ఏకంగా ఓ వ్యక్తి రూ.1.20 కోట్లకు దక్కించుకున్నారు. గత సంవత్సరం ఈ ప్రదేశంలోనే లడ్డూ వేలంపాటలో రూ.60.80 లక్షలు పలికింది. గతంలో తనపేరు మీద ఉన్న రికార్డుని బద్ధలు కొట్టి.. సరికొత్త రికార్డుగా నమోదు చేసింది. ఈ వేలంపాటలో వచ్చిన మొత్తం నగదును చారిటీ తరఫున.. సామాజిక సేవ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. గత పది సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
"మేం అందరం దాదాపు 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ప్రతి సంవత్సరం వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహిస్తాం. ఇందులో వచ్చిన డబ్బులన్ని చారిటీకి ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు, హెల్త్‌కేర్ వర్కర్స్ కోసం, డబ్బు లేక చదువుకోలేక పోతున్న విద్యార్థులకు సాయం చేస్తాం. అలాగే కొన్ని ఎన్జీవోలకు సరకులు కొనిస్తాం. ఇందులో వచ్చే ఒక్క రూపాయి కూడా మేం వాడుకోం. ఈ డబ్బంతా సేవకు మాత్రమే ఉపయోగిస్తాం. గతేడాది రూ.60 లక్షలకుపైగా పలికింది. ఈ ఏడాది రూ.1.20 కోటికి పైగా ధర పలికింది." - గణేశ్ కమిటీ నిర్వాహకులు
రాష్ట్రంలో లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డ్.. ధర రూ.60.80లక్షలు
BandlaGuda Jagir Laddu Auction Price 2023 :పదేళ్లుగా కీర్తి రిచ్మండ్ విల్లాలో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఇక్కడి గణేశ్ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఏటా వినాయక చవితి సంబురాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ పదకొండు రోజులు విల్లాలోని సభ్యులంతా సాయంత్రం కాగానే తమ పనులన్నీ ముగించుకుని గణపయ్య సేవలో నిమగ్నమవుతామని చెప్పారు. గణేశ్ ఉత్సవాలన్నీ రోజులు తమ పిల్లలు కూడా ఆటలు మానేసి.. స్వామి సన్నిధి వద్దే ఉంటారని.. రాత్రి పూట భజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని వెల్లడించారు. మహాగణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లేటప్పుడు.. పిల్లలు బోరున ఏడుస్తారని నిర్వాహకులు అన్నారు.
Record Price For Bandlaguda Ganesh Laddu 2023 : పదేళ్ల నుంచి గణేశ్ ఉత్సవాలునిర్వహిస్తున్నాం. పదకొండో రోజున నిమజ్జనం చేస్తాం. ఆ రోజునే ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. లడ్డూ వేలంపాట మొదలుపెడతాం. ఇందులో విల్లాలో ఉన్న వాళ్లం మాత్రమే పాల్గొంటాం. ఇది ఎవరికి దక్కినా.. అందరం కలిసి సేవా కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఉపయోగిస్తాం. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం వాడం. మా లాగే మిగతా గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఇలా లడ్డూ వేలం పాట నిర్వహించి.. ఆ డబ్బును సేవ కోసం వినియోగించాలని కోరుకుంటున్నాం. అని కీర్తి రిచ్మండ్ విల్లా గణేశ్ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు.
Balapur Ganesh Laddu Auction 2023 : కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట.. గత రికార్డు బ్రేక్ అవుతుందా..?
Ganesh Gold Laddu in Hyderabad : బొజ్జ గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే..?