తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో మరో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి 3కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. మహిళ సజీవదహనం - truck dragged scooty in banda

ఉత్తర్​ప్రదేశ్ బాందాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు స్కూటీని బలంగా ఢీకొట్టింది. అనంతరం స్కూటీని 3 కిలోమీటర్ల వరకు ట్రక్కు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోనూ ఇదే తరహా ఘటన జరిగింది.

banda-road-accident-truck
banda-road-accident-truck

By

Published : Jan 5, 2023, 11:24 AM IST

దిల్లీలో 20 ఏళ్ల యువ‌తిని కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి దారుణం చోటుచేసుకుంది. బాందా జిల్లాలోని మావాయ్‌ బజ్‌రంగ్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను 3 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. పుష్పదేవి అనే ప్రభుత్వ ఉద్యోగిని నిత్యావసరాల కోసం వెళ్తుండగా బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తోటి వాహనదారులు లారీని వెంబడించినప్పటికీ డ్రైవర్‌ ఆపకుండా 3 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. మహిళకు సైతం మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు.

ట్రక్కుకు అంటుకున్న మంటలు
మంటల్లో కాలిపోయిన ట్రక్కు

మృతురాలు స్థానిక వ్యవసాయ యూనివర్సిటీలో పని చేస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు.. వెంటనే రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రహదారిని అడ్డగించి పలు వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను శాంతింపజేశారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి భర్త గతేడాది చనిపోయారని, కారుణ్య నియామకం కింద ఆయన ఉద్యోగం మహిళకు వచ్చిందని సమాచారం.

మంటల్లో ట్రక్కు

మరో ఘటన..
మరోవైపు, నోయిడాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. డెలివరీ బాయ్​ను ఢీకొట్టిన ట్యాక్సీ డ్రైవర్.. 500 మీటర్లు లాక్కెళ్లాడు. డెలివరీ ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. జనవరి 1న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కజిన్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'నా కజిన్ స్విగ్గీలో పనిచేసేవాడు. రాత్రి ఫోన్ చేసిన సమయంలో ఎవరో ఓలా డ్రైవర్ లిఫ్ట్ చేశారు. రోడ్డుపై చనిపోయి పడి ఉన్నాడని డ్రైవర్ చెప్పారు' అని మృతుడి బంధువు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ ఘటన జరిగిందని.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మృతుడు

ABOUT THE AUTHOR

...view details