తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Ballot Papers Stolen : అధికారుల కారును అడ్డుకుని.. బ్యాలెట్​ పేపర్లు, ల్యాప్​టాప్​లు చోరీ.. ఎలక్షన్​ అడ్డుకునేందుకే! - ఎన్నికల అధికారుల కారులో చోరీ

Ballot Papers Stolen : ఎన్నికల అధికారుల కారును అడ్డగించి బ్యాలెట్ పేపర్లు, రెండు ల్యాప్‌టాప్​ల​ను ఎత్తుకెళ్లారు నలుగురు వ్యక్తులు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Ballot Papers Stolen
Ballot Papers Stolen

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 11:18 AM IST

Updated : Sep 28, 2023, 11:51 AM IST

Ballot Papers Stolen : కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఎన్నికల అధికారుల కారును అడ్డగించిన కొందరు వ్యక్తులు.. బ్యాలెట్​ పేపర్లు, రెండు ల్యాప్​టాప్​లు దొంగలించి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని మాగడి తాలూకా హోసపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. అందుకు సంబంధించిన విధుల కోసం ఎన్నికల అధికారి ఉమేశ్​, ఉషతో సహా ఐదుగురు హుల్లేనహళ్లి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో కెంచనహళ్లి సమీపంలో అధికారుల బొలెరో వాహనాన్ని నలుగురు వ్యక్తులు అడ్డగించారు.

గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడే..
ఎన్నికల అధికారుల వద్ద ఉన్న 250 బ్యాలెట్ పేపర్లు, 2 ల్యాప్‌టాప్‌లు దోచుకుని పరారయ్యారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారిని కారు ఢీకొట్టగా.. ఇంతలో నిందితులు పారిపోయారు. అయితే గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు బలరాం, అతడి సహచరులు ఈ దోపిడీకి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికలను అడ్డుకునేందుకే..
ఘటనకు సంబంధించి దాసేగౌడ, శ్రీనివాస్‌, హేమంత్‌ సహా మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మాగడి పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఎన్నికలను అడ్డుకునేందుకే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోందని అన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం.. ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​గఢ్​లో జగత్​పుర్​ యాక్సిక్​ బ్యాంక్​లోని రూ. 7 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. బ్యాంక్ సిబ్బందిని గదిలో వేసి బంధించి.. లాకర్​లోని సొమ్ముతో పరారయ్యారు. అడ్డుకోబోయిన బ్యాంక్ మేనేజర్​ను గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఉద్యోగులు బ్యాంక్​ను తెరిచి.. కార్యకలపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏడుగురు గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా బ్యాంక్​లోకి ప్రవేశించారు. కత్తితో బెదిరించి బ్యాంక్ మేనేజర్​ను లాకర్ తాళం ఇవ్వాలని అడిగారు. దీనికి మేనేజర్ అంగీకరించకపోవడం వల్ల అతడి తొడపై గాయం చేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని.. సెక్యూరిటీ గార్డు సహా బ్యాంక్ ఉద్యోగులను ఓ గదిలో వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Sep 28, 2023, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details