తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Balakrishna Comments on Junior NTR: జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ బ్రో: బాలకృష్ణ - బాలకృష్ణ చిత్రాలు

Balakrishna Comments on Junior NTR: బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు అరెస్టులో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదని పేర్కొన్నారు. అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయలేమని బాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై తాను తప్పకుండా కేంద్రాన్ని కలుస్తానని చెప్పారు. సినిమా వాళ్లు స్పందించకపోయినా పట్టించుకోనని.. జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ అన్నారు.

Balakrishna Comments on Junior NTR
Balakrishna Comments on Junior NTR

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 7:46 PM IST

Updated : Oct 4, 2023, 9:44 PM IST

Balakrishna Comments on Junior NTR: జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ బ్రో: బాలకృష్ణ

Balakrishna Comments on Junior NTR: ఆంధ్రప్రదేశ్​లో సైకో పరిపాలన నడుస్తోందని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. ఇక్కడ ప్రజా సంక్షేమం గాలికి వదిలి.. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17ఏ సెక్షన్‌ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తనకు అవగాహాన లేదని తెలిపిన ఆయన... అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయమని వెల్లడించారు. కేంద్రం కల్పించుకోవాల్సిన సమయంలో... వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తన అక్క పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశంపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తానని తెలిపారు.సినిమా వాళ్లు స్పందించక పోవడంపై తాను పట్టించుకోనని.. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అన్నారు.

Achchennaidu on Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌కు సంబంధం లేదని ప్రభుత్వమే క్లీన్​చిట్ ఇచ్చింది: అచ్చెన్నాయుడు

త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని... ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్‌ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ తెలిపారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందని వెల్లడించారు. చంద్రబాబు నిజాయితీ గురించి ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబును రిమాండ్‌లోకి తీసుకున్న అనంతరం సెక్షన్‌లు చెబుతున్నారని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారని వెల్లడించారు. కానీ, తెలంగాణలో 3 రోజుల నుంచి చంద్రాబాబు అరెస్ట్​ను ఖండిస్తున్నారని.. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారంటూ బాలకృష్ణ ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ ఇంతకాలం అజ్ఞాతంలో ఉందని.. ఇకపై టీటీడీపీలో మళ్లీ చైతన్యం వస్తోందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా... తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Balakrishna Interesting Comments : 'తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం'

తమ పార్టీ కేసులు, అరెస్ట్​లకు భయపడదని, తమకు న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని బాలకృష్ణ వెల్లడించారు. అక్రమ అరెస్ట్​లపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తత సృష్టిస్తున్నారని.. అనడం సరి కాదన్న ఆయన.. తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని బాలకృష్ణ తెలిపారు. తెలంగాణలో అంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీ పునర్వైభవానికి ప్రతి క్షణం పోరాడతామని బాలకృష్ణ వెల్లడించారు. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదనేవారికి తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.

NBK Media Conference : ఇలాంటివి ఎన్నో చూశాం.. భయపడే ప్రసక్తే లేదు..! మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను : బాలకృష్ణ

Last Updated : Oct 4, 2023, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details