ఉత్తర్ప్రదేశ్ భాగ్పత్ జిల్లా చాందీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగోలి తాంగ్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఓ కూడలిలో పార్క్ చేసి ఉన్న కారులో ఆటలాడుకుంటున్న నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. మరో చిన్నారిని పోలీసులు కాపాడి ఆస్పత్రికి తరలించారు.
పిల్లలు కారులో ఆడుకునే సమయంలో పొరపాటున లాక్ పడి ఈ ప్రమాదం జరిగింది. డోర్లు తెరచుకోకపోవడం వల్ల శ్వాస ఆడక వారు మరణించారు. ఆస్పత్రికి తరలించిన మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.