Tajinder Bagga arrest: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో దిల్లీ భాజపా నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గాకు ఊరట లభించింది. మే 10 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పంజాబ్- హరియాణా హైకోర్టు ఆదేశించింది. బగ్గాపై శనివారం మొహలీ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేయగా, దానిపై స్టే విధించాలని కోరుతూ ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ చిత్కారా శనివారం రాత్రి తన నివాసంలో అత్యవసరంగా విచారించి బగ్గాకు ఊరట కల్పిస్తూ తీర్పు వెలువరించారు.
బగ్గాకు ఊరట.. పంజాబ్ పోలీసులకు షాక్.. అర్ధరాత్రి 'హైకోర్టు' కీలక ఆదేశాలు! - దిల్లీ భాజపా నేత
Tajinder Bagga arrest: దిల్లీ భాజపా నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గాకు ఊరట లభించింది. మే 10 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పంజాబ్-హరియాణా హైకోర్టు ఆదేశించింది. మొహలీ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంటుపై స్టే విధించింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట భాజపా యువజన విభాగం మార్చి 30న నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా బగ్గా చేసిన వ్యాఖ్యలపై ఆప్ నేత సన్నీ అహ్లూవాలియా ఫిర్యాదు మేరకు పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ ఒకటిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వివాదాస్పద ప్రసంగాలు, శత్రుత్వాన్ని రగిల్చేందుకు యత్నించారని అభియోగాలు మోపారు. ఇదే కేసులో శుక్రవారం పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి మొహలీకి తరలిస్తుండగా.. హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గాను దిల్లీ పోలీసులు తిరిగి దేశ రాజధానికి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి:దిల్లీ భాజపా నేతను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. హరియాణాలో టెన్షన్!