ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం6నెలల తర్వాత తెరుచుకుంది. తెల్లవారుజామున4.15గంటలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలోఈ కార్యక్రమానికి కొంత మంది సాధవులు, పూజారులు, దేవస్థానం ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ప్రత్యక్ష దర్శనాలను రద్దు చేసిన దేవస్థానం.. భక్తుల సందర్శనార్థం ఆలయ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం - 4 గంటలకు తెరుచుకున్న బద్రీనాథ్
చార్దామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం మంగళవారం తెరుచుకుంది. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ 4.15 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు పండితులు.
బద్రీనాథ్ ఆలయం
హిమాలయాల్లోని నాలుగు పుణ్యక్షేత్రాల సందర్శనను ఛార్‌దామ్ యాత్రగా పిలుస్తారు. ఈనెల14న యమునోత్రి, 15న గంగోత్రి, 17న కేదార్‌నాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. హిమాలయాల్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల ఆరునెలలు మాత్రమే ఈ ఆలయాల ద్వారాలుతెరిచి ఉంటాయి.
Last Updated : May 18, 2021, 8:56 AM IST