Baby Shower for pet Dog: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలను చాలామంది అమితంగా ప్రేమిస్తుంటారు. అందుకే వాటిని కన్నబిడ్డల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అంతేకాదు.. బిడ్డలకు ఎలా ఫంక్షన్లు చేస్తారో వాటికి కూడా అలాగా వేడుకలు జరిపిస్తారు. ఇటీవల ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇందులో భాగంగానే పెంపుడు జంతువు గర్భం దాల్చినా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. సీమంతం జరిపి తమ సంతోషాన్ని చాటుకుంటారు. తమిళనాడులోని సిర్కాలి ప్రాంతంలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది.
పెంపుడు కుక్కకు సీమంతం.. బంధుమిత్రులతో కలిసి ఘనంగా.. - తమిళనాడులో పెంపుడు కుక్కకు సీమంతం
Baby Shower for pet Dog: మన దేశంలో గర్భిణులకు సీమంతం పేరుతో వేడుకలు నిర్వహించడం సాధారణం. కానీ.. కుక్కలకు సీమంతం చేయడం చూశారా? తమిళనాడుకు చెందిన కుటుంబం మాత్రం తాము పెంచుకుంటున్న కుక్క గర్భం దాల్చిందని తెలిసి సీమంతం చేశారు. అంతే కాదు.. ఈ ఫంక్షన్‌కు ఇరుగుపొరుగు వారిని కూడా పిలిచారు.

నితీశ్‌కుమార్, శివరాజ్ దంపతుల పిల్లలు తమ మేనమామ ఇంటి నుంచి కుక్కపిల్లను తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. తమ పెంపుడు కుక్కకు 'సిక్కీ' అని పేరు పెట్టారు. వారి ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిన సిక్కీ.. ప్రస్తుతం గర్భం దాల్చింది. అప్పటి నుంచి నితీశ్ కుటుంబ సభ్యులు ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. తమ కన్న బిడ్డలకు ఎలాగైతే సీమంతం చేస్తారో అదే రీతిలో ఇంట్లోని పెంపుడు కుక్కకు వేడుకగా సీమంతం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బంధుమిత్రులను, ఇరుగుపొరుగువారిని పిలిచి సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:పుల్వామా నిందితుడిని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం