తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral: నవ్వులు పూయిస్తున్న 'పిల్లకోతి' చేష్టలు - చిన్నారి కోతి వైరల్ న్యూస్

ఓ కోతి పిల్ల చేసిన చిలిపి చేష్టలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది. ఓ గోడను ఎక్కేందుకు ఆ కోతి చేసిన సాహసానికి ఫలితమే ఇది. ఇంతకీ ఏం జరిగిందంటే..

monkey, viral monkey
కోతి, చిన్నారి కోతి

By

Published : Jul 17, 2021, 1:05 PM IST

ఓ కోతి పిల్ల చేసిన చిలిపి చేష్టలు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. ఆ వానర ప్రయత్నంపై కామెంట్ల జోరు సాగుతోంది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే..

ఓ కోతి పిల్ల.. గోడ ఎక్కేందుకు తెగ ఇబ్బంది పడింది. ఇంతలోనే తనతో పాటు ఉన్న ఓ పెద్ద కోతి.. సునాయాసంగా గోడ ఎక్కి కూర్చుంది. అది చూసి తానూ ఎక్కాలని తహతహలాడింది. అప్పటికీ చాలా ప్రయత్నాలే చేసింది. అప్పుడే ఆ కోతి పిల్లకు ఓ ఐడియా వచ్చింది. ఆ పెద్ద కోతి తోక వేలాడుతుండగా.. దానిని పట్టుకుని చకచకా గోడను ఎక్కేసింది.

ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details