తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బుజ్జి ఏనుగును కాపాడబోతే గజరాజుల దాడి- ఊరంతా ధ్వంసం!

ఆహారం కోసమని గ్రామంలోని వచ్చిన ఓ పిల్ల ఏనుగు బావిలో పడింది. దీని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు 5 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది చివరకు దానిని రక్షించారు. అయితే.. ఈ సమయంలో ఏనుగుల మంద వచ్చి ఆ గ్రామంపై దాడి చేసింది.

Baby elephant rescued from well
బావిలో పడిన పిల్ల ఏనుగు

By

Published : Jan 9, 2022, 5:36 PM IST

బుజ్జి పిల్లను కాపాడబోతే ఏనుగుల దాడి

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఓ పిల్ల ఏనుగు బావిలో పడింది. దీని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఐదు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి దానిని రక్షించారు. ఈ సమయంలోనే మరో ఏనుగుల గుంపు అక్కడ ఉన్న గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసింది.

బావిలో పడిన పిల్ల ఏనుగు

ఏనుగుల దాడిలో సుమారు నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలంలో నిలిపి ఉంచిన అధికారుల వాహనాలను కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు అటవీ సిబ్బంది తెలిపారు.

ఏనుగులు దాడిలో ధ్వంసం అయిన ఇల్లు
ఏనుగుల దాడిలో ధ్వంసం అయిన అధికారులు వాహనం

గత కొద్ది రోజులుగా.. సుమారు 15 ఏనుగులు ఆహారం కోసం అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోని చాకుందపాద గ్రామంలోని వచ్చిన పిల్ల ఏనుగు బావిలో పడినట్లు తెలిపారు. గజరాజులు ఏ క్షణాన దాడి చేస్తాయే అనేది తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నట్లు గ్రామస్థులు వాపోయారు.

ఇదీ చూడండి:యువతకు స్ఫూర్తిగా 80ఏళ్ల బామ్మ- రోజూ 20 కి.మీ. సైకిల్​ తొక్కి ఉద్యోగానికి...

ABOUT THE AUTHOR

...view details