Monkey Throws Baby: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మూడు అంతస్తుల భవనంపై నుంచి ఓ నాలుగు నెలల పసికందును కోతి కిందకు విసరేసింది. దీంతో ఆ నవజాత శిశువు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇదీ జరిగింది..జిల్లాలోని డంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ భార్య ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం నిర్దేశ్ దంపతులు.. తమ కొడుకును తీసుకుని ఇంటి డాబాపైకి వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ కోతుల గుంపు వారిమీదికి వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు.. కోతులను తరిమికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వానరాలు బెదరలేదు. దీంతో చేసేదేమీ లేక.. నిర్దేశ్ దంపతులు పిల్లాడ్ని తీసుకుని మెట్లవైపు పరిగెత్తారు. అకస్మాత్తుగా నిర్దేశ్ చేతి నుంచి పిల్లవాడు జారిపడిపోయాడు.