కేరళలోని తిరువనంతపురమ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి 8 నెలల బాలుడు సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు.
పసికందు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం
09:32 March 08
చిన్నారి సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం
దవలపురమ్, వర్కాల సమీపంలోని చెరున్నియూర్‌కు చెందిన ప్రతాపన్ ఇల్లు రాహుల్ నివాస్‌లో సోమవారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇంటి ముందు పార్క్ చేసిన ఐదు ద్విచక్రవాహనాలు సైతం కాలిబూడిదయ్యాయి. ఇంట్లో చెలరేగుతున్న మంటలు, పొగను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
మృతులు ప్రతాపన్(64), అతని భార్య షెర్లీ(53), చిన్న కుమారుడు అఖిల్(25), పెద్ద కూమారుడి భార్య అభిరామి(24), అతని 8 నెలల కుమారుడు రయాన్గా గుర్తించారు. తీవ్ర గాయాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిఖిల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.