రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తన నిర్ణయం మార్చుకున్నారు. ప్రస్తుతం బంగాల్లోని అసన్సోల్ నుంచి భాజపా ఎంపీగా ఉన్న ఆయన.. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తానని ప్రకటించారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నా. అయితే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డా సూచనల మేరకు ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నా. నా రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా. దిల్లీలో నాకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నా."
-బాబుల్ సుప్రియో