దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) వినూత్నంగా ఆలోచించారు. కొండముచ్చుల కటౌట్లను సెంటర్లో ఉంచారు.
గత కొద్ది రోజుల నుంచి సెంటర్లో కోతుల బెడద ఎక్కువయింది. పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బందిని బెదిరిస్తున్నాయి. వీటి ముప్పును తప్పించేందుకు కొండముచ్చుల కటౌట్లను సెంటర్ ప్రాంగణంలో ఉంచామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వినయ్ పాండే తెలిపారు. కొండముచ్చుల బొమ్మలను చూసి కోతులు దూరంగా ఉంటున్నాయని వివరించారు.