తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాబా కా దాబా'కి చేరిన విరాళాల సొమ్ము

'బాబా కా దాబా' యజమాని కాంతా ప్రసాద్​కు యూట్యూబర్​ గౌరవ్​ వాసన్​ వసూలు చేసిన మొత్తం చెల్లించారు. ఈ విషయాన్ని ప్రసాద్​నే స్వయంగా వెల్లడించారు. అయితే వసూలు చేసిన విరాళాల మొత్తం ఎంత అనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు.

baba ki dhaba owner receive money from youtuber gaurav wasan
'బాబా కా దాబా' కి ముట్టిన విరాళాల సొమ్ము

By

Published : Nov 4, 2020, 5:46 AM IST

'బాబా కా దాబా'కు సంబంధించి నెటిజన్లు అందించిన విరాళాల్లో రూ. 3.78 లక్షలు యూట్యూబర్​ గౌరవ్​ వాసన్​ తమకు చెల్లించారని దాబా యజమాని కాంతా ప్రసాద్​ తెలిపారు. వసూలు చేసిన మొత్తం ఎంత అనేది వాసన్​కు తప్ప తనకు తెలియదన్నారు. దీనిపై ఇప్పటికే ఆక్రమ వసూళ్లకు వాసన్​ తెర లేపాడని ప్రసాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వృద్ధుడు ప్రసాద్​ ఆరోపణలను గౌరవ్​ వాసన్​ ఖండించారు. నిజంగా నేను 25లక్షల వరకు వసూలు చేసి ఉంటే అవి నా బ్యాంక్​ ఖాతాలో కనిపించాలి కదా అని అన్నారు.

ఇదీ చూడండి:'బాబా కా దాబా' విరాళాల పేరుతో మోసం!

లాక్​డౌన్​లో వైరలైన వీడియోల్లో 'బాబా కా దాబా' ఒకటి. దిల్లీలోని వృద్ధదంపతులు కరోనా ఆంక్షలతో ఏవిధంగా నష్టపోయారు అని తెలుపుతూ.. ​వాసన్​ అనే వ్యక్తి ఈ వీడియోను రూపొందిచారు. ఇది సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రాచూర్యం పొందింది.

ఇదీ చూడండి:సోషల్​ మీడియా సత్తా... 'కాన్​జీ బడే'కు అందరూ ఫిదా!

ABOUT THE AUTHOR

...view details