గతేడాది లాక్డౌన్ సమయంలో గిరాకీ లేక.. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు పొందిన 'బాబా కా దాబా'(Baba ka Dhaba) యజమాని కాంతా ప్రసాద్ని కష్టాలు వెంటాడుతున్నాయి. విరాళాల ద్వారా సమకూరిన సొమ్ముతో ప్రారంభించిన రెస్టారెంట్ ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటోంది. దీనితో తన పాత బండిని నడపేందుకు తిరిగి వచ్చాడు. తాను జీవించి ఉన్నంత కాలం దీనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
"నేను జీవించి ఉన్నంత వరకు ఈ దాబాను నడుపుతాను. గతేడాది లాక్డౌన్ సమయంలో మాకు వచ్చిన విరాళాల నుంచి నాతో పాటు నా భార్య అవసరాల కోసం రూ.20 లక్షలు పక్కనపెట్టుకున్నాం."
-కాంత ప్రసాద్, బాబా కా దాబా
'తన వినియోగదారుల్లో చాలామందికి పాత చోటు బాగా తెలుసని.. కాబట్టి దాని ద్వారా ఎక్కువ సంపాదించగలను'అని ఆయన పేర్కొన్నారు.