తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంగ్లేయ కామాంధులకు అడ్డుపడి.. అమరుడైన హంపన్న - స్వంతంత్ర సమరయోధుడు

భారతీయ మహిళల మాన మర్యాదలను కాపాడేందుకు ఎంతో మంది సామాన్యులు సైతం తమ ప్రాణాలనూ పణంగా పెట్టారు. ఆంగ్లేయుల జాతి దురహంకారాన్ని ధైర్యంగా ఎదిరించారు. రైల్వే గేటుకీపరుగా(Railway gate keeper)పనిచేసిన గూళపాళెం హంపన్న(gulapalyam hampanna) అనే ధీరుడు ఇలాంటి ప్రయత్నంలోనే 128 ఏళ్ల క్రితం ఇదే రోజు అమరుడయ్యారు.

goolapalem-hampanna
గూళపాళెం హంపన్న

By

Published : Oct 4, 2021, 7:46 AM IST

ఈ వీరగల్లు గుడిలో.. కావలి హంపన్న ఆత్మ కాపురముండున్‌ తావెక్కడ చాలును భర తావనియే వాని ఆలయమ్మగును గదా!

- హంపన్న గురించి విద్వాన్‌ విశ్వం రాసిన 'ఒకనాడు' కావ్యంలోని భాగమిది

తెల్లవారి జాతి దురహంకారాన్ని భారతదేశంలో(britishers in india) సామాన్యులు సైతం ధైర్యంగా ఎదిరించారు. భారతీయ మహిళల మాన మర్యాదలను కాపాడేందుకు ప్రాణాలనూ పణంగా పెట్టారు. రైల్వే గేటుకీపరుగా(Railway gate keeper) పనిచేసిన గూళపాళెం హంపన్న(gulapalyam hampanna) అనే ధీరుడు ఇలాంటి ప్రయత్నంలోనే 128 ఏళ్ల క్రితం ఇదే రోజు అమరుడయ్యారు. ప్రస్తుత అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళపాళేనికి చెందిన హంపన్న.. గుంతకల్లు వద్ద రైల్వేగేటు కాపలాదారుగా పనిచేసేవారు. ఆయన బ్రిటిష్‌ సిపాయిల తుపాకిగుళ్లనూ లెక్కచేయకుండా ఎదిరించిన తీరును నేటికీ స్మరించుకుంటారు.

.

1893 అక్టోబరు 4న తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న సైనిక పటాలం గుంతకల్లు వద్ద రైలు మారాల్సి వచ్చింది. సిపాయిలు ఓ బంగళాలో దిగారు. మద్యం తాగి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఓ యువతి, వృద్ధురాలు వారి కంటపడ్డారు. సైనికులు అత్యాచారం చేయబోగా వారిద్దరూ తప్పించుకుని రైల్వేగేటు వద్దకు చేరుకున్నారు. గేటుకీపరు హంపన్న వారి దీనస్థితిని చూసి, తన గదిలో ఆశ్రయం ఇచ్చారు. సైనికులు గది తలుపులు విరగ్గొట్టబోయారు. తాను నిరాయుధుడినని, అవతలి వారి చేతిలో తుపాకులున్నాయని కూడా హంపన్న వెరవలేదు. వారితో వీరోచితంగా తలపడ్డారు. ఒక్క ఉదుటన సైనికులను అవతలకు నెట్టేశారు. దాంతో సైనికులు తుపాకితో హంపన్నను కాల్చగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తుపాకిగుళ్ల శబ్దం విని రైల్వేపోలీసులు, స్థానికులు చేరుకోవడంతో సైనికులు పారిపోయారు. హంపన్నను గుత్తి ఆసుపత్రికి తరలించినా, దారిలోనే మరణించారు. ఈ ఘటనపై బ్రిటిష్‌ కోర్టులో విచారణ తప్పు దోవ పట్టింది. హంపన్నే ఆ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని, తమపై దాడి చేయబోగా ఆత్మరక్షణ కోసం కాల్చామని సైనికులు చెప్పగా, కోర్టూ నిర్ధారించింది.

హంపన్న వీరత్వాన్ని ప్రపంచానికి చాటాలనుకున్న స్థానికులే విరాళాలు సేకరించి, గుత్తిలో 9 చదరపు అడుగుల స్థలం కొని, హంపన్న సమాధి, స్మారకం నిర్మించారు. గుంతకల్లులో బ్రిటిష్‌ సైనికుల బారి నుంచి ఇద్దరు స్త్రీలను రక్షించబోయి అమరుడైన హంపన్న అస్థికలు ఇక్కడ భూస్థాపితం చేసినట్లు ఫలకంపై రాయించారు.

ఇదీ చూడండి:Azadi ka amrut mahotsav: తూటాలు దిగినా.. 'వందేమాతరం' ఆపలేదు

ABOUT THE AUTHOR

...view details