Kohinoor stolen by British: బ్రెజిల్‌లో వజ్రాల గనులు బయటపడే దాకా... ప్రపంచానికి భారతే వజ్రాల ఖని! ఆ క్రమంలో గోల్కొండ ప్రాంతంలో కోహినూర్ వజ్రం వెలుగు చూసిందని అంటుంటారు. ఎలా చేరిందోగాని- ఖైబర్ కనుమ ద్వారా భారత్‌లో అడుగుపెట్టిన మొఘల్ చక్రవర్తుల చేతికి చిక్కిందిది. ఆ సమయంలో... సుసంపన్నమైన దిల్లీపై మధ్య ఆసియాలోని ఇతర పాలకులు.. ముఖ్యంగా పర్షియన్ చక్రవర్తి నాదిర్‌షా కన్ను పడింది. 1739లో దిల్లీపై దండెత్తిన నాదిర్ షా 700 ఏనుగులు, 4 వేల ఒంటెలు, 12 వేల గుర్రాలపై సంపదనంతా దోచుకుపోయాడు. వాటిలో కోహినూర్ కూడా ఉంది. తర్వాత ఈ వజ్ర రాజం కోసం అక్కడా అనేక యుద్ధాలు జరిగాయి. చివరికది... చేతులు మారుతూ 1813లో లాహోర్ రాజధానిగా పంజాబ్‌ను పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ చేతికి చిక్కింది. మొదట్నుంచీ ఈ వజ్రంపై కన్నేసిన ఆంగ్లేయులు... రంజిత్‌సింగ్‌తో పెట్టుకోలేక వేచిచూశారు. అయితే రంజిత్‌సింగ్ తన మరణానంతరం దీన్ని మతగురువుకు ఇవ్వాలని భావించారంటారు.
Kohinoor British Story
1839లో ఆయన మరణించగానే.. ఆంగ్లేయులు తమ పావులు కదపటం ఆరంభించారు. సిక్కు సామ్రాజ్యంతో పాటు కోహినూర్‌ను చేజిక్కించుకోవటానికి రెండు యుద్ధాలు చేశారు. అవే ఆంగ్లో-సిక్కు యుద్ధాలు. సిక్కుల్లోని కొంతమంది సామంత రాజులను తమవైపు లాక్కొని ఆంగ్లేయులు విజయం సాధించారు. చివరకు రంజిత్‌సింగ్ మూడో భార్య రాణి జిందన్ కౌర్, చిన్న పిల్లవాడైన కుమారుడు దులీప్‌సింగ్ మాత్రమే మిగిలారు. ఆంగ్లో-సిక్కు యుద్ధానంతరం 1849లో రాణి జిందన్‌ను ఖైదు చేసి జైలుకు పంపించి.. తల్లీకొడుకులను విడగొట్టారు. ఏమీ తెలియని బాలుడు దులీప్‌సింగ్‌తో లాహోర్ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. దులీప్‌ను పేరుకు రాజుగా పేర్కొంటూ.. అందుకు ప్రతిగా కోహినూర్‌తోపాటు వారి ఆస్తిపాస్తులన్నీ విక్టోరియా మహారాణికి సమర్పిస్తున్నట్లు రాయించుకున్నారు. వజ్రరాజాన్ని తీసేసుకున్నారు. గవర్నర్ జనరల్ డల్హౌసీ దాన్ని రాణి విక్టోరియాకు సమర్పించారు. అప్పట్నుంచి అది బ్రిటిష్ రాణి ఆభరణాల్లో ఒకటైంది. 1851లో లండన్‌లో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచితే... లండన్‌వాసులంతా ఎగబడి వచ్చి చూశారు. దూరం నుంచి దీన్ని చూసి... 'ఏముందిది? గాజులా ఉందే' అంటూ పెదవి విరిచారు. దీంతో- చక్రవర్తి అలర్ట్, రాణి విక్టోరియాలు దానికి నగిషీలద్ది పరిమాణం తగ్గించారు.
మతమూ మార్చి..!