తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలకు కేంద్రం గుడ్​ న్యూస్​- ఫ్రీ హెల్త్​ ఇన్సూరెన్స్​ రెట్టింపు- ఇకపై రూ.10లక్షలు! - ayushman bharat health account abha

Ayushman Bharat Insurance Hike : పేద ప్రజలకు గుడ్ న్యూస్​ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్రం రూ. 10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Ayushman Bharat Insurance Hike
Ayushman Bharat Insurance Hike

By PTI

Published : Jan 17, 2024, 3:34 PM IST

Updated : Jan 17, 2024, 4:10 PM IST

Ayushman Bharat Insurance Hike :ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్రం రూ. 10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్​, అవయవ మార్పిళ్లు లాంటి వాటికి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల పరిమితిని రూ.10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్​లో ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

లబ్దిదారుల పెంపునకు ప్రయత్నాలు
దీంతో పాటు ఆయుష్మాన్ భారత్​ లబ్దిదారుల సంఖ్యను సైతం 100 కోట్లకు పెంచడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. వచ్చే మూడేళ్లలో కిసాన్​ సమ్మాన్ నిధి, భవన నిర్మాణ రంగ కార్మికులు, నాన్​ కోల్​మైన్​ వర్కర్స్, ఆశా వర్కర్స్​ను ఇందులో భాగం చేయాలని భావిస్తోంది. రూ. 10 లక్షల చొప్పున 100కోట్ల కుటుంబాలకు కలిపి ఏడాదికి సుమారు రూ.12,076కోట్లు అదనంగా అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్​లో కేటాయింపులు పెంచాలని కేంద్రం భావిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.7,200కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దానిని రెట్టింపు చేసి రూ.15,000కోట్లకు పెంచే అవకాశం ఉంది.

బయట చేసుకుంటే ఖర్చు రెట్టింపు
2018లో ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 6.2కోట్ల ఆస్పత్రులు ఇందులో చేరాయి. మొత్తంగా రూ.79,157కోట్ల విలువైన చికిత్సలు జరిగాయి. ఇదే చికిత్స ఆయుష్మాన్​ భారత్​ ద్వారా కాకుండా బయట చేసుకుంటే ఈ ఖర్చు రెట్టింపు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం లబ్దిదారులకు కేంద్రం ఈ-కార్డులు (ఆయుష్మాన్ భారత్ కార్డు) జారీ చేస్తోంది. జనవరి 12 నాటికి 30కోట్ల ఆయుష్మాన్​ కార్డులను డౌన్​లోడ్ చేసుకున్నారు. ఇందులో ఉత్తర్​ప్రదేశ్​ 4.83కోట్ల కార్డులతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్​ 3.78కోట్లు, మహారాష్ట్ర 2.39కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉంది. దాదాపు 11 రాష్ట్రాల్లో ఒక కోటికి పైగా కార్డులు డౌన్​లోడ్​ అయ్యాయి. ఆయుష్మాన్​ భారత్​ పథకం ద్వారా అర్హులైన ఒక్కో కుటుంబానికి ప్రస్తుతం కేంద్రం ప్రతి ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనైనా ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు పొందవచ్చు.

How to Download Ayushman Bharat Card : మీకు "ఆయుష్మాన్ భారత్" కార్డు ఉందా..? రూ.5 లక్షల దాకా ఉచిత వైద్యం.. ఇలా పొందండి!

'ఆయుష్మాన్​ భారత్' కేంద్రాల్లో 28కోట్ల మందికి సేవలు

Last Updated : Jan 17, 2024, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details