తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2021, 9:37 AM IST

ETV Bharat / bharat

ప్రపంచ ఆరోగ్య సంస్థతో 'ఆయుష్​' కీలక ఒప్పందం

ఆగ్నేయాసియాలో ప్రాంతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్​తో​ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఆయుష్​ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

AYUSH Ministry, WHO SEARO ink agreement to bolster traditional medicine in S-E Asia region
ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఆయుష్​ కీలక ఒప్పందం

ఆయుష్​ మంత్రిత్వ శాఖకు, డబ్ల్యూహెచ్ఓ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆయుష్​కు చెందిన ఓ నిపుణుడు డబ్ల్యూహెచ్​ఓకు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించి ఆయుష్​ కార్యదర్శి వైద్య రాజేశ్​ కొటెచా, డబ్ల్యూహెచ్​ఓ ఆగ్నేయ ఆసియా డైరెక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆగ్నేయ ఆసియాలో ప్రాంతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకే కేంద్రంతో డబ్ల్యూహెచ్​ఓ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఆగ్నేయ దేశాల్లో సంప్రదాయ వైద్యాన్ని బలపరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోంది. యోగా, ఆయుర్వేదం సహా పలు సంప్రదాయ వైద్యాలపై ఇప్పటికే డబ్ల్యూహెచ్​ఓతో అనేక సార్లు చర్చించామని కొటేచా వెల్లడించారు. భారత్​ ప్రాంతీయ వైద్యం.. ఆగ్నేయ ఆసియా సహా ఆఫ్రికా, ఐరోపా, లాటిన్​ అమెరికాల్లో ప్రాచూర్యం పొందినట్లు ప్రకటనలో ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి :బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?

ABOUT THE AUTHOR

...view details