కొవిడ్ మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) పిల్లల కోసం ఓ కిట్‌ను(immunity booster medicine) రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే 'బాల్ రక్షా కిట్'ను(immunity booster for kids) అభివృద్ధి చేసింది. కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలో ఏఐఐఏ పనిచేస్తోంది. ఈ కిట్ కొవిడ్ కారక కరోనా వైరస్‌పై(immunity booster for covid) పోరాడేందుకు, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు. ఇంతవరకు పిల్లలకు కొవిడ్ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
16ఏళ్లలోపు పిల్లల రోగనిరోధక శక్తికి 'బాల్ రక్ష కిట్' - immunity booster in children
16 ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే 'బాల్ రక్షా కిట్'ను(immunity booster for kids) భారత ఆయుర్వేద సంస్థ అభివృద్ధి చేసింది. ఇంతవరకు పిల్లలకు కొవిడ్ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
కిట్‌లో భాగంగా.. తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికొరైస్ (యష్టిమధుకం), ఎండు ద్రాక్షలతో తయారు చేసిన సిరప్‌తోపాటు అన్ను ఆయిల్, సీతోపలాది, చ్యవన్‌ప్రాశ్‌లు ఉంటాయని వెల్లడించారు. ఈ సిరప్‌లో అద్భుత ఔషధ గుణాలున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కిట్‌ను రూపొందించారని.. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ 'ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఎంపీసీఎల్) తయారు చేసినట్లు చెప్పారు. నవంబరు 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏఐఐఏ 10 వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనుంది.
ఇదీ చూడండి:డ్యాన్స్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి.. మోదీ కితాబు