అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5మండపాలు, గర్భగుడి పనులు పూర్తవుతాయని, 2023 డిసెంబరు నాటికి భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయట్రస్ట్ వర్గాలు తెలిపాయి.
శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం - అయోధ్య రామమందిరం ఎప్పుడు మొదలైంది?
2023 డిసెంబరు నాటికి అయోధ్య రామ మందిరానికి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అలాగే 2025నాటికి మందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించాయి. మందిర ప్రాంగణంలో మ్యూజియంతో పాటు.. పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు.
RAM TEMPLE
2025నాటికి ఆలయం నిర్మాణం పూర్తి కానున్నట్టు పేర్కొన్నాయి. రామ మందిర ప్రాంగణంలో మ్యూజియం, డిజిటల్ ఆర్చివ్స్‌తోపాటు పరిశోధనా కేంద్రం ఉంటాయని ఆలయట్రస్ట్ వర్గాలు తెలిపాయి. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత రామ్‌లల్లా విగ్రహాలను నూతన మందిరంలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: