ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కవాతులో 32 శకటాలు పాల్గొనగా ఉత్తర్‌ప్రదేశ్ శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామ మందిర నమూనాతో పాటు ఆ పవిత్ర నగర సాంస్కృతిక వారసత్వాన్ని, దీపోత్సవ ప్రాముఖ్యతను, రామాయణంలోని కీలక ఘట్టాలను తెలియజెప్పేలా రూపొందించిన ఆ శకటాన్ని ఉత్తమ శకటంగా కేంద్రం ఎంపిక చేసింది.
రామ మందిర శకటం.. అత్యుత్తమం - అయోధ్య రామ మందిర శకటం
రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న శకటాలకు పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. అయోధ్య రామ మందిర నమూనాతో రూపొందిన ఉత్తర్‌ప్రదేశ్ శకటానికి ప్రథమ అవార్డు దక్కింది. త్రిపుర, ఉత్తరాఖండ్ శకటాలకు ద్వితియ, తృతియ పురస్కారాలు వరించాయి.
రామ మందిర శకటం.. అత్యుత్తమం
ఇదీ చదవండి:పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'అయోధ్య' శకటం
త్రిపుర రాష్ట్ర శకటానికి ద్వితీయ పురస్కారం లభించింది. సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆత్మనిర్భర భారత్‌ను సాధించేందుకు పర్యావరణ అనుకూల సంప్రదాయాల ఆచరణను ప్రోత్సహించేలా ఈ శకటాన్ని రూపొందించారు. 'దేవతల భూమి' థీమ్ రూపకల్పన చేసిన ఉత్తరాఖండ్ శకటానికి తృతీయ పురస్కారం లభించింది. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పురస్కారాలు అందజేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.