2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabh Election 2024 ) కంటే ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ ధీమా వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు. ఆలయ శంకుస్థాపన మొదటి దశ పనులు (Ram Mandir Construction) సెప్టెంబర్ పూర్తి కాగా.. రెండో దశ పనులు మాత్రం నవంబర్ 15 నాటికి పూర్తి అవుతాయన్నారు.
ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇవి రాత్రి సమయాల్లో మాత్రమే చేస్తున్నారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 2023లోగా ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించాం. అది పూర్తి అయితే భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.