తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం కోసం మౌనవ్రతం- పదేళ్ల వయసులో ప్రతిజ్ఞ- ప్రాణప్రతిష్ఠ రోజు విరమణ! - అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ

Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా మౌనవ్రతం చేస్తున్నాడు ఓ వృద్ధుడు. దీంతోపాటు కాలికి చెప్పులు సైతం వేసుకోకుండానే తిరుగుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం రోజున మళ్లీ మాట్లాడి మౌనవ్రతాన్ని వీడాలని సంకల్పించుకున్నాడు.

Ayodhya Ram Mandir Pran Pratishtha
Ayodhya Ram Mandir Pran Pratishtha

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 1:25 PM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha :అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు మౌనవ్రతం చేస్తానని 10 ఏళ్ల వయసులో ప్రతిజ్ఞ చేశాడు ఓ వ్యక్తి. దీంతో పాటు గుడిలో రామ్​లల్లాను ప్రతిష్ఠించేవరకు కాలికి చెప్పులు సైతం వేసుకోబోనని ప్రతినబూనాడు. దీంతో అప్పటి నుంచి అతడిని మోని బాబాగా పిలుస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కోరిక ఫలించడం వల్ల జనవరి 22న శ్రీరాముడి నామాన్ని స్మరించుకోని మౌనవ్రతాన్ని వీడాలని అనుకుంటున్నాడు.

మధ్యప్రదేశ్​ దతియా జిల్లాలోని సూర్య నగర్​కు చెందిన మోహన్ గోపాల్ దాస్​ అనే వ్యక్తికి చిన్ననాటి నుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో దేవాలయం లేకపోవడం వల్ల కలత చెందాడు. ఈ క్రమంలోనే పదేళ్ల వయసులోనే రామ మందిరాన్ని నిర్మించేంతవరకు తాను మౌనవ్రతం చేస్తానని, కాలికి చెప్పులు సైతం వేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు కరసేవకులతో అయోధ్య సైతం వెళ్లాడు.

మోహన్ గోపాల్ దాస్​

అయితే, ఎన్నో ఏళ్ల తర్వాత కోర్టు తీర్పుతో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు గోపాల్ దాస్. జనవరి 22న జరిగే రాముడి ప్రాణప్రతిష్ఠకు మోదీ తనకు ఆహ్వానం పంపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇందుకోసం ఎస్​పీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. ఆహ్వానం వస్తుందేమోనన్న ఆశతో రోజూ కార్యాలయాలు చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, పలకపై రాసి సమాధానం ఇస్తున్నాడు.

పలకపై రాసి చూపిస్తున్న మోహన్​

మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాపన
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్​సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ వేడుకకు వేల మంది సాధువులు విచ్చేస్తారని నిర్వాహకులు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరోవైపు, రాముడి ప్రతిష్ఠాపన ప్రకటన చేసిన తర్వాత అయోధ్య గురించి భారీగా సెర్చ్ చేస్తున్నారు. ట్రావెల్​ బుకింగ్​ ప్లాట్​ఫామ్​ల్లో భారత్​తో పాటు అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి బుకింగ్ చేసుకుంటున్నారు. భారత్​లో అయోధ్య కోసం సుమారు 1,806 శాతం సెర్చింగ్​ పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ బుకింగ్ సంస్థ మేక్​ మై ట్రిప్​ తెలిపింది. ఎయిర్​పోర్ట్ ప్రారంభించిన డిసెంబర్​ 30 తేదీన భారీ స్థాయిలో సెర్చ్ చేశారని సంస్థ ప్రతినిధి తెలిపారు.

భక్తుల కోసం వందలాది రూమ్స్​ బుక్​​- అతిథులకు పునాది మట్టి, సరయూ నీటితో గిఫ్ట్ ప్యాక్​

'ఆ పని కోసం విధి మోదీని ఎంచుకుంది'- రామాలయ నిర్మాణంపై అడ్వాణీ వ్యాసం

ABOUT THE AUTHOR

...view details