Ayodhya Ram Mandir Opening 2024 : ఓ వైపు ప్రస్తుతం దేశమంతటా రామ నామ స్మరణ విశేషంగా జరుగుతోంది. మరోవైపు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు (Ayodhya Ram Mandir) సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇప్పటికే తెలిపింది. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటించింది.
అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్‌తో నెక్లెస్- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు :మరోవైపు రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు (Special Trains Ayodhya) నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని కాజీపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, సామర్లకోట, విజయవాడ, గుంటూరు స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.
బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్ సూపర్!