తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ భూకంపాలను తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణం - డిజైన్లలో హైదరాబాదీ ప్రొఫెసర్‌ కీ రోల్

Ayodhya Ram Mandir Opening 2024 : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ భూకంపాలను తట్టుకునేలా ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ ఆలయం స్ట్రక్చరల్‌ డిజైన్‌ రూపొందించిన బృందంలో హైదరాబాద్‌ వాసి పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ రామన్‌చెర్ల అయోధ్య డిజైన్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 12:27 PM IST

Ayodhya Ram Mandir Opening 2024 : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ అద్వితీయ పండుగ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 17 రోజుల్లో ఘనంగా ప్రారంభం కానున్న నీలమేఘ శ్యాముడి ఆలయ నిర్మాణం (Ayodhya Ram Mandir ) అద్భుతరీతిలో ఉండేందుకు శిల్పులు రాత్రింబవళ్లు శ్రమించారు. ఒక్క ఇనుపచువ్వ లేకుండా అంతా రాతితోనే స్తంభాలను నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Hyderabad Professor in Ayodhya Temple Designing :ఈ ఆలయం స్ట్రక్చరల్‌ డిజైన్‌ రూపొందిచిన బృందంలో హైదరాబాద్‌ వాసి పాలుపంచుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ రామన్‌చెర్ల (Dr. Ramancharla Pradeep Kumar) ఇందులో కీలకపాత్ర పోషించారు. సుమారు నాలుగు సంవత్సరాలుగా రామమందిర నిర్మాణంలో ఆయన బృందం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంది. స్ట్రక్చరల్‌ డిజైన్‌, పునాదుల నిర్మాణంలో ఆయన బృందం సభ్యులు రాత్రింబవళ్లూ శ్రమించారు.

అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?

Ayodhya Ram Mandir Specialties :అయోధ్యలో రామమందిరం నిర్మించాలని 2020 ప్రథమార్థంలో కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ బాధ్యతలను ఉత్తరాఖండ్‌లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)కు అప్పగించింది. డిజైన్ల నిర్మాణ వ్యయం, ఇతర అంశాలు టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌), నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థలకు కేటాయించింది.

Ayodhya Ram Mandir Unique Features :కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ఆదేశాలతో వివిధ విభాగాల అధికారులు, సోంపురా వంశస్థుల ప్రతినిధులు, టాటా కన్సల్టెన్సీ అధికారులు, ఎల్‌అండ్‌టీ సంస్థ ఇంజినీర్లు సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంచాలకులు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ రామన్‌చెర్ల పలుమార్లు దేవాలయ ఆకృతిపై చర్చలు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామాలయ ఆకృతిపై సంతృప్తిచెందిన తర్వాత పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి.

అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్​తో నెక్లెస్​- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!

తరతరాలపాటు నిలిచిపోయేలా స్ట్రక్చరల్‌ డిజైన్‌ : తరతరాలపాటు నిలిచిపోయేలా స్ట్రక్చరల్‌ డిజైన్‌ను డాక్టర్‌ ప్రదీప్‌ రామన్‌చెర్ల తన బృందంతో రూపొందించారు. పునాదుల నుంచి స్తంభాల వరకూ ఎక్కడా స్టీల్‌ (ఇనుము) వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. నాలుగైదు నెలలపాటు శ్రమించి డిజైన్‌ను తయారు చేశారు. భారీ భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండేలా స్తంభాలు, సూపర్‌ స్ట్రక్చర్‌ను రూపొందించారు.

Ram Mandir Opening Ceremony : మరోవైపు అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16న ప్రారంభం కానున్నాయి. 17న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహించనున్నారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.

బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్​ సూపర్​!

'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు'

ABOUT THE AUTHOR

...view details