Ayodhya Ram Mandir Modi : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. బుధవారం.. మోదీ నివాసానికి వెళ్లిన ట్రస్ట్ సభ్యులు.. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి మోదీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోదీ.. ఎక్స్(ట్విట్టర్)వేదికగా తెలిపారు.
'గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా'
Ayodhya Ram Mandir Inauguration Date :"ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం" అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు.
Ayodhya Ram Mandir Tunnel : అయోధ్య రామయ్య భక్తుల కోసం పటిష్ఠ ఏర్పాట్లు.. ఆలయంలో సొరంగం నిర్మాణం
'అన్ని ఆలయాల్లో కార్యక్రమాలు..'
Ayodhya Ram Mandir Opening Date :వచ్చే ఏడాదిజనవరి 22వ తేదీన అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
బాలుడి రూపంలో రామచంద్రుడు..
Ayodhya Ram Statue :రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. రాముడి విగ్రహం అక్టోబర్ 30 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తెలిపారు. ఆ తేదీ నాటికి విగ్రహాన్ని ట్రస్ట్ సభ్యులు వీక్షించేందుకు సిద్ధం చేస్తామని చెప్పారు. బాల రాముడి రూపంలో విగ్రహం ఉంటుందని వివరించారు. మొత్తంగా మూడు రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వేర్వేరు శిల్పులు వీటిని చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి రామ మందిరం గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారు. రాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని విపిన్ భదౌరియా చెబుతున్నారు.
Shri Ram Pillar Ayodhya : 290 ప్రదేశాల్లో శ్రీరాముని స్తూపాలు.. అయోధ్యకు చేరుకున్న మొదటిది.. వెయ్యేళ్లు చెక్కుచెదరట!