Ayodhya Ram Mandir Budget : ఉత్తర్‌ప్రదేశ్.. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి 2023 మార్చి వరకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు ఈ భారీ వ్యయం జరిగినట్లు తెలిపింది. ఇంకా రూ.3000 కోట్లు.. ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలిపింది.
రామ్ లల్లా ప్రతిష్ఠపై ప్రధాన చర్చ..
Ayodhya Ram Mandir Opening : ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే రామమందిర ట్రస్ట్ సమావేశం.. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ నివాసంలో శనివారం జరిగింది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రామ్ లల్లా ప్రతిష్ఠామహోత్సవాల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. ఆలయ నిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు సంబంధించిన వివరాలు సహా 18 అంశాలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు చర్చించుకున్నారు.
2025 నాటికి..
Ayodhya Ram Mandir Construction Status : సమావేశం అనంతరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరాలను వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు మూడు దశల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి దశ 2024 జనవరి నాటికి, రెండో దశ 2024 డిసెంబర్ నాటికి, మూడో దశ 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ప్రకటించారు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కథా మ్యూజియం లీగల్ ట్రస్ట్‌గా ఉంటుందని.. రామమందిరానికి సంబంధించిన 50 ఏళ్ల చట్టపరమైన పత్రాలు అందులో భద్రపరుస్తామని చెప్పారు.