ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని ధనిపుర్ గ్రామంలో నిర్మిస్తున్న మసీదు, ఆసుపత్రి కాంప్లెక్స్‌కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు. దేశ విముక్తి కోసం పోరాటం చేసి, 164 ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన మౌల్వి అహ్మదుల్లా షా ఫైజాబాది పేరును పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోని మసీదు, ఆసుపత్రి, మ్యూజియం, పరిశోధన కేంద్రం, కమ్యూనిటీ కిచెన్లను ఫైజాబాదికి అంకితమివ్వనున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) తెలిపింది.
" ఆయన అమరుడైన రోజున.. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించాం. జనవరిలో పరిశోధన కేంద్రాన్ని ఫైజాబాదికి అంకితమిచ్చాం. తొలి స్వాతంత్ర్య పోరాటం తర్వాత 160 ఏళ్లు గడిచినా.. ఆయనకు భారత చరిత్రలో సరైన స్థానం దక్కలేదు. ఫైజాబాద్‌లోని సరాయ్ మసీదు ఆయన పేరుతో ఉన్న ఏకైక భవనం. "