Ayodhya land scam news: అయోధ్య భూకుంభకోణం ఆరోపణలపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించించడం కేవలం కంటితుడుపు చర్యేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంగా గాంధీ వాద్రా విమర్శించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. దిల్లీలో ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించిన ప్రియాంక.. అత్యున్నత ధర్మాసనం అయోధ్య భూకొనుగోలు వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. భాజపా నేతలు ప్రజల విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ ఆస్తులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
Priyanka Gandhi Press conference
"విచారణకు ఆదేశిస్తున్నాం అని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎవరు దర్యాప్తు చేస్తున్నారు? జిల్లా స్థాయి అధికారులు. జిల్లా స్థాయిలో ఈ దర్యాప్తు జరుగుతోంది. రామ మందిర ట్రస్టు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏర్పాటైంది. కాబట్టి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టే దర్యాప్తు చేపట్టాలి."
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేత
Ayodhya BJP land scam
భాజపా నేతలు, వారి కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రభుత్వ అధికారులు.. అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల భూములను కొనుగోలు చేశారని కథనాలు వెలువడ్డాయి. బలవంతంగా వీటిని కొన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.
Ayodhya land Scam Congress
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు తీవ్రంగా స్పందించారు. 'మతం ముసుగులో హిందుత్వవాదులు దోపిడీ చేస్తున్నారు' అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. "హిందువులు సత్యమార్గంలో నడుస్తారు. హిందుత్వవాదులు మతం ముసుగులో దోపిడీ చేస్తారు" అని హిందీలో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఈ వ్యవహారాన్ని భూ కుంభకోణంగా అభివర్ణించారు. భాజపాకు సంబంధించిన వ్యక్తులు.. అయోధ్య నగరంలోని భూములను బహిరంగంగా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. 'భాజపా ఎమ్మెల్యేలు, మేయర్లు, కీలక పదవుల్లో ఉన్నవారి బలవంతపు భూకొనుగోళ్లపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? గౌరవనీయులైన మోదీజీ.. ఈ బహిరంగ లూటీపై మీరు ఎప్పుడు నోరు తెరుస్తారు? కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలు, రామ భక్తులు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. ఇది దేశ ద్రోహం కాదా? అయోధ్య పరిస్థితి 'అయోమయ పాలకులు- అస్తవ్యస్తమైన రాజ్యం'గా తయారైంది. ఈ విషయంపై ఎప్పుడు విచారణ జరుగుతుంది? అసలు విచారణ జరుగుతుందా లేదా? దీనిపై మోదీ వైఖరి ఏంటి?' అని వరుస ప్రశ్నలు సంధించారు.
ఇదీ చదవండి:'మోదీజీ.. అయోధ్యలో ఆ పరిస్థితులపై మౌనమేల?'