తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది- ఆ ట్రయల్స్ సక్సెస్- త్వరలో 3లక్షల మంది!

Ayodhya Deepotsav 2023 Rehearsal Success : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముందు నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిహార్సల్ ప్రక్రియలో భాగం​గా ఏర్పాటు చేసిన ఈ మహాక్రతువు విజయవంతం అయినట్లుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు తెలిపారు.

The Trial Of Deepotsav Before Pran Pratistha Was Successful, More Than 2 Lakh Devotees Had Darshan Of Ramlala
Deepotsav 2023 Ayodhya Rehearsal Success

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 9:24 PM IST

Updated : Nov 17, 2023, 11:05 AM IST

అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది- ఆ ట్రయల్స్ సక్సెస్- త్వరలో 3లక్షల మంది!

Ayodhya Deepotsav 2023 Rehearsal Success :ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్​లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది. నవంబర్​ 10 నుంచి 14 వరకు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు లక్షల్లో పాల్గొన్నట్లుగా పేర్కొంది. దీపోత్సవం రోజునే ఏకంగా 2 లక్షల మందికిపైగా ప్రజలు శ్రీరాముడిని దర్శించుకున్నారని విశ్వహిందూ పరిషత్​ మీడియా ఇంఛార్జ్​ శరద్​ శర్మ వెల్లడించారు.

రంగురంగుల లైట్లతో రామాలయం ముస్తాబు

"అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి సోషల్​ మీడియాలో, టీవీల్లో వస్తున్న ప్రకటనలను చూసి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. అయితే నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం తర్వాత ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతోంది. నా అంచనా ప్రకారం ఈ ఏడాది 3 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ దీపోత్సవం విజయవంతం కావడానికి యోగి సర్కార్​ కూడా ప్రత్యేకంగా చొరవ చూపించింది. వారిని మేము అభినందిస్తున్నాము."

-శరద్​ శర్మ, విశ్వహిందూ పరిషత్​ మీడియా ఇంఛార్జ్

రిహార్సల్​గా దీపోత్సవం..
జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యే లక్షలాది భక్తులను సమన్వయం చేసుకోవడానికి ట్రయల్​గా దీపోత్సవం నిర్వహించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా రాముడిని దర్శించుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. బృందాలుగా ఏర్పడిన రామభక్తుల సాయంతో.. సాధారణ ప్రజలకు సులువుగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వివిధ చెక్​పాయింట్లను ఏర్పాటు చేసి... ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా క్యూలైన్​లో భక్తులను రాముడిని దర్శనానికి పంపించారు. దీపోత్సవానికి వచ్చిన భక్తుల సంఖ్య ఆధారంగా రానున్న రోజుల్లో ఎంతమంది వస్తారనే అంచనాకు వచ్చి మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

రామ్​లల్లా ఉత్సవ మూర్తులు

"రాముడి భక్తుల కోసం అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 24 వరకు ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవం భారత్​లో మాత్రమే కాదు ప్రపంచంలోనే గిన్నిస్​ రికార్డ్​ను సాధించింది. దీపోత్సవానికి వచ్చిన భక్తులను నూతనంగా నిర్మించిన ఆలయంలోకి కూడా అనుమతించారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. దీపోత్సవం తర్వాత కూడా ఆలయానికి భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత రానున్న రోజుల్లో కూడా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది."

- ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్​లల్లా ప్రధాన అర్చకులు

ఇక వచ్చే ఏడాది జనవరిలో జరిగే అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది శ్రీరామ జన్మభూమి ట్రస్టు. వీరికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.

అయోధ్యలో యముడికి ప్రత్యేక పూజలు- దీపావళి తర్వాత పెద్ద జాతర!

22లక్షల దీపాల వెలుగులో అయోధ్య- ఉజ్జయిని రికార్డు బ్రేక్​, గిన్నిస్​లో చోటు

Last Updated : Nov 17, 2023, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details