Ram Mandir Garbha Griha: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా.. రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అయోధ్య హనుమాన్‌గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం.
2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది రామాలయ పనులు చూసుకుంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా.