కేరళ కొట్టాయం జిల్లాలోని అయమానమ్ నమూనా బాధ్యతాయుత గ్రామీణ పర్యటక ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) పర్యాటక పురస్కారం లభించింది. ఈ మేరకు లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళ టూరిజం డైరెక్టర్ కృష్ణతేజ అవార్డును అందుకున్నారు.
సీఎం పినరయి విజయన్.. అయమానమ్ను మోడల్ రెస్పాన్సిబుల్ టూరిజం గ్రామంగా ప్రకటించిన 14 నెలల తర్వాత ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్థానిక ప్రజలు ఉపాధి, పర్యటక ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా సంస్కృతిని పెంపొందించింది. అంతేకాదు పర్యాటక మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తోంది. ఇందుకుగాను అయమానమ్ గ్రామం.. డబ్ల్యూటీఓ అవార్డును సొంతం చేసుకుంది.