తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లికి ముందు - పార్ట్​నర్​తో ఈ పనులు చేయొద్దు!

Avoid These Mistakes Before Getting Married: ఇద్దరి ఇష్టంతో జరిగిన పెళ్లి.. ఆ తర్వాత విభేదాల పేరుతో విడాకుల వరకూ ఎందుకు వెళ్తుంది? అంటే.. ఒకరి గురించి మరొకరు తప్పుగా అంచనా వేసుకోవడమే కారణమంటున్నారు నిపుణులు. అందుకే.. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామితో ఎలా ఉండాలి? ఏం మాట్లాడాలి? అనే విషయాలపై క్లారిటీ ఉండాలంటున్నారు. మరి.. అవి ఏంటో మీకు తెలుసా?

Marriage_tips
Marriage_tips

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 5:04 PM IST

Avoid These Mistakes Before Getting Married: పెళ్లికి ముందు అమ్మాయి-అబ్బాయి కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడు అంతటా జరుగుతున్నదే. జీవితాంతం కలిసి నడవాల్సిన వారు కాబట్టి.. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. అన్నట్టుగా ప్రీ వెడ్డింగ్ మీట్స్ కొనసాగుతున్నాయి. అయితే.. పెళ్లికి ముందు ఏం మాట్లాడాలి? కాబోయే పార్టనర్​తో ఎలాంటి విషయాలు డిస్కస్ చేయాలి? అనేదానిపై చాలా మందికి క్లారిటీ ఉండదు. ఏవేవో మాట్లాడేసి.. ఆ తర్వాత "మిస్​ అండర్​స్టాండింగ్​"తో అవస్థలు పడుతుంటారు. కాబట్టి.. పెళ్లికి ముందు కలిసినప్పుడు కాబోయే భాగస్వామితో కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంప్రెస్​ వద్దు :కొత్తగా రిలేషన్ షిప్‌ మొదలు పెట్టినప్పుడు.. చాలా మంది ఎదుటివారిని ఎలా ఇంప్రెస్ చేసేందుకు తెగ ట్రై చేస్తుంటారు. అందుకోసం ఏవేవో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్​లో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే.. అది మీ ఒరిజినల్ వ్యక్తిత్వం కాదని అర్థం. ఇలాంటివి కొంత కాలం తర్వాత మాయమవుతాయి. దీంతో.. అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. "పెళ్లైన కొత్తలో అలా ఉన్నావ్.. ఇప్పుడు ఇలా తయారయ్యావ్.. నువ్వు మారిపోయావ్" అంటూ గొడవలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. మీరు మీలాగే ఉండండి. ఒరిజినాలిటీని ప్రదర్శించండి. అప్పుడు మీ వ్యక్తిత్వంపై వారికి ఓ క్లారిటీ వస్తుంది. తద్వారా.. భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ తక్కువ

గౌరవించండి : ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం అనేది అలవర్చుకోవాలి. నేను చెప్పింది విని తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదని చెబుతున్నారు. అదే సమయంలో.. ప్రేమ చూపించే విషయంలోనూ అతి చేయొద్దంటున్నారు. దీనివల్ల ఎక్స్​పెక్టేషన్స్ మరింతగా​ పెరుగుతాయి. ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతే దాంపత్యంలో ఇబ్బందులు ఖాయమని అంటున్నారు.

అప్పు లేకుండా పిల్లల పెళ్లి చేయాలా? - ఈ సూపర్ ఫైనాన్షియల్ టిప్స్ మీకోసమే!

పాత రిలేషన్ గురించి :మీరిద్దరూ మీ గురించే మాట్లాడాలి. మీ ప్రస్తుతం.. కావాలంటే భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోండి. కానీ.. మీ గతం గురించి మాత్రం వద్దు. ఏం చేసినా.. గతాన్ని మార్చలేరు. కాబట్టి.. మీ గత ప్రేమ వ్యవహారాలను మీకు కాబోయే భాగస్వామికి చెప్పడం ద్వారా సాధించేదేమీ ఉండదు. పైగా అనవసరంగా వారి మనసులో ఒక ఆలోచన నాటిన వారవుతారు. అందువల్ల.. గతానికి నీళ్లు వదిలేయండి. మీరిద్దరూ కలిసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి.. ఈ బంధంలో నిజాయితీగా ఉంటే సరిపోతుంది. సినిమాల్లో మాదిరిగా పాత విషయాలు చెప్పాలనే ప్రయత్నాలు వదిలేయండి. దీనివల్ల నష్టానికే అవకాశం ఎక్కువ.

క్లియర్​గా చెప్పండి :మీ ఇష్టాలు.. అలవాట్లు.. అభిరుచులు.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే విషయాలు ఏవైనా సరే ముందే చెప్పండి. దాంతోపాటు మీరు ఏ విషయం చెప్పాలనుకున్నా.. సూటిగా చెప్పండి. అప్పుడు ఎదుటివారికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మీ గురించి ఓ అవగాహనకు రావడానికి అవకాశం ఉంటుంది. సగం చెప్పి.. సగం దాచిపెడితే.. భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ విధంగా.. పెళ్లికి ముందే మీ గురించి క్లారిటీ ఇవ్వడం ద్వారా ఫ్యూచర్ హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

కొత్తగా పెళ్లైందా? మీరు తెలుసుకోవాల్సిన ఆర్థిక పాఠాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details