తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆటోపై 'మినీ తోట'.. సమ్మర్​లో సూపర్​ కూల్.. సెల్ఫీలతో ఎక్స్​ట్రా ఇన్​కమ్​! - ఆటో టాప్​పై గార్డెన్

మిద్దె తోటల గురించి చాలాసార్లు విని ఉంటారు. మేడపైన మొక్కలు పెంచితే.. ఇల్లంతా చల్లగా ఉంటుందని.., పూలు, కూరగాయల ఖర్చు తగ్గుతుందని చాలా వార్తలు చూసి ఉంటారు. అదే తరహాలో 'ఆటో తోట'ను సృష్టించాడు ఓ సాధారణ డ్రైవర్. ఆటోపై 25 రకాల మొక్కలు పెంచుతూ.. వేసవిలోనూ తన వాహనం చల్లగా ఉండేలా చూస్తున్నాడు. అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు.

auto roof top garden
ఆటోపై 'మినీ తోట'.. సమ్మర్​లో సూపర్​ కూల్.. సెల్ఫీలతో ఎక్స్​ట్రా ఇన్​కమ్​!

By

Published : May 5, 2022, 1:35 PM IST

Updated : May 5, 2022, 4:45 PM IST

ఆటోపై 'మినీ తోట'
భానుడు భగభగలాడుతున్నాడు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వడగాలులతో విరుచుకుపడుతున్నాడు. ఇలాంటి మండే వేసవిలో ప్రయాణాలు చేయడం కాస్త ఇబ్బందే. ఆటోలో అయితే మరింత కష్టం. కానీ.. దిల్లీలోని మహేంద్ర కుమార్ ఆటో ఎక్కితే అలాంటి సమస్యలేమీ ఉండవు. అతడి వాహనంపై ఉన్న మినీ తోటనే అందుకు కారణం.
మహేంద్ర కుమార్
ఆటో తోట వద్ద సెల్ఫీ దిగుతున్న యువత
మహేంద్ర కుమార్ 'గ్రీన్ ఆటో'

మహేంద్ర కుమార్ స్వరాష్ట్రం బిహార్. 25-30 ఏళ్లుగా దిల్లీలోనే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వేసవిలో సూర్య ప్రతాపంతో విసిగిపోయిన అతడికి.. రెండేళ్ల క్రితం ఓ 'చల్లటి' ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. దానిని ఆచరణలో పెట్టాడు. ఆటోపై మినీ తోట వేశాడు. ఇందుకోసం టాప్​పై మ్యాట్​ పరిచి, మట్టి వేసి.. మొక్కలు నాటాడు. రోజూ నీళ్లు పోసి, ఎప్పటికప్పుడు మొక్కలు కత్తిరిస్తూ.. ఆటో తోటను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

ఆటోపై రెండేళ్లుగా ఇలా మొక్కలు పెంచుతున్నా. ఆటో మొత్తం చల్లగా ఉంటుంది. లోపల కూలర్, ఫ్యాన్​ కూడా పెట్టా. ప్రయాణికులు చాలా సంతోషిస్తున్నారు. చూడగానే సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ మొక్కల్ని చూసిన ఆనందంతో రూ.10-20 ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇప్పటి వరకు ఇలా ఎవరినీ చూడలేదు అని పొగుడుతున్నారు. ప్రభుత్వం నీకు అవార్డ్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదా అంటున్నారు.

--మహేంద్ర కుమార్, ఆటో డ్రైవర్

టమాట, బెండకాయ, జామ, మామిడి, అరటి.. ఇలా 25 రకాల మొక్కలు మహేంద్ర కుమార్​ ఆటోపై ఉన్నాయి. ఈ మినీ తోట.. అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. దూరం నుంచి చూసే.. మహేంద్ర ఆటో వస్తోందని గుర్తుపడుతున్నారు. కొందరు ఆటోలో ప్రయాణించాల్సిన ప్రతిసారీ అతడికే ఫోన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చిన వారు.. ఈ ఆటో తోటను చూసి ఫిదా అవుతున్నారు.

నేను ఒక అరుదైన దృశ్యం చూశా. వేడి తగ్గించేందుకు ఆటోపై మొక్కలు పెంచుతున్నారు. ఫొటో తీసుకున్నా. ఆటో డ్రైవర్​తో మాట్లాడా. ఎలా, ఎందుకు చేశారని అడిగా. ఇది మంచి ప్రయత్నం. వీలుంటే అందరూ ఇలా చేయాలి.

--జెరీన్, కేరళ వాసి

మొక్కలకు నీళ్లు పోస్తున్న మహేంద్ర
'గ్రీన్​ ఆటో'తో మహేంద్ర కుమార్
Last Updated : May 5, 2022, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details