తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు! - మంటల్లో ఆటో

బిహార్​లోని పూర్ణియాకు చెందిన ఓ డ్రైవర్​ తన సొంత ఆటోనే తగలబెట్టాడు. కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన అతడు.. ఏం చేయాలో తెలియక ఇలా తన ఆటోపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. ఆటోను కాల్చాక.. మిగిలిన ఇనుప సామగ్రిని అమ్మి రేషన్​ సరకులు కొనుక్కుంటానని చెప్పాడతడు.

Auto fire
ఆటోను తగలబెట్టిన డ్రైవర్​!

By

Published : May 26, 2021, 2:31 PM IST

కరోనా కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న లాక్​డౌన్​.. బడుగు జీవుల పాలిట పెను శాపంగా మారుతోందనడానికి సాక్ష్యంగా నిలిచే సంఘటన బిహార్​లో జరిగింది. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి.. నిరాశకు గురైన ఓ డ్రైవర్​ తన సొంత ఆటోనే తగలబెట్టాడు.

మంటల్లో కాలిపోతున్న ఆటో

అసలేమైందంటే..

బిహార్​లోని పూర్ణియాకు చెందిన రవి అనే ఆటో డ్రైవర్​కు​ కరోనా ప్రభావం వల్ల 8 నెలలుగా.. ఉపాధి అంతంత మాత్రంగానే సాగింది. ఈ క్రమంలో తన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లల్ని కూడా ఆమె తన వెంట తీసుకెళ్లింది. తన కడుపు నింపే ఆటో కాస్తా పాతదైపోయింది. షోరూమ్​లో ఈ ఆటోకు బదులు వేరే ఆటోను మార్చుకునేందుకు ప్రయత్నిస్తే.. వారు అందుకు భారీ డబ్బులు డిమాండ్ చేశారు.

విసిగిపోయి..

ఉన్న ఆటోనే ఏదోలా నడిపిస్తూ.. 'తినడానికి డబ్బులైనా మిగులుతున్నాయి కదా' అని అనుకుంటున్న సమయంలో.. కరోనా రెండో దశ విజృంభణ మొదలైంది. వైరస్​ వ్యాప్తి కట్టడికి మే1 నుంచి మే15 వరకు లాక్​డౌన్​ విధించింది బిహార్​ ప్రభుత్వం. మే 15 తర్వాతనైనా.. మళ్లీ తన ఆటోను రోడ్డు మీదకు ఎక్కించాలని ఓపికతో ఎదురు చూశాడతడు. కానీ, ప్రభుత్వం మాత్రం లాక్​డౌన్​ను జూన్​ 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో విసిగిపోయిన రవికుమార్​ తన ఆటోను పెట్రోల్​ పోసి తగలబెట్టాడు.

ఆటోపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన డ్రైవర్​
ఆటో డ్రైవర్​ రవి ​

ఈ ఆటోను కాల్చగా.. మిగిలిన ఇనుప సామగ్రిని అమ్మి.. రేషన్​ సరకులైనా కొనుక్కుంటానని చెప్పాడు రవి​. అందుకే తన ఆటోకు నిప్పు అంటించానని వివరించాడు. రవి​ తన ఆటోను తగలబెడుతున్నాడని తెలిసి.. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తమ ఫోన్లలో వీడియో రికార్డు చేశారు.

ఇదీ చూడండి:కారు సీటుబెల్టుకు కట్టి కొవిడ్ మృతదేహం తరలింపు

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: నిశ్శబ్దంగా శునకాన్ని వేటాడిన మొసలి

ABOUT THE AUTHOR

...view details