తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముహూర్తానికి ముందు పెళ్లి నగలు మిస్సింగ్.. లక్కీగా ఆటో డ్రైవర్​ వల్ల..

ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో మరచిపోయిన రూ.6 లక్షల విలువైన పెళ్లి నగల బ్యాగ్​ను తిరిగి వారికి అందజేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 3, 2022, 12:43 PM IST

ఓ మండపంలో పెళ్లి వేడుక జరుగుతోంది. వివాహానికి వచ్చిన బంధువులతో సందడి వాతారణం నెలకొంది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె నగల బ్యాగ్ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇంతలో కనిపించకుండా పోయిన నగల బ్యాగ్​తో ఓ ఆటో డ్రైవర్​ మండపంలోకి వచ్చాడు. దీంతో అందరి ముఖాలపై చిరునవ్వు పూసింది.

అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లా హల్ద్​వానీ ఓ పెళ్లి వేడుక జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులందరూ ఆటోలో ఫంక్షన్​ హాల్​కు వెళ్లారు. ఆటో దిగి, నగల బ్యాగ్​ను అందులోనే మరచిపోయారు. ఆ బ్యాగ్​లో రూ. 6 లక్షలు విలువైన నగలతో పాటు రూ.50 వేల నగదు కూడా ఉంది. అనంతరం నగల బ్యాగ్​ గురించి వెతకగా అది దొరకలేదు. దీంతో అప్పటివరకు కోలాహలంగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా టెన్షన్​ మొదలైంది.

పెళ్లి కుమార్తెను ఆశీర్వదిస్తున్న ఆటో డ్రైవర్ వల్లభ్​ జోషి​

ఆటోలో మరచిపోయిన బ్యాగ్​ను గమనించకుండా.. డైవర్​ తన ఇంటికెళ్లాడు. అనంతరం ఆటోలో సంచిని గమనించాడు. దాదాపు రెండు గంటల తర్వాత.. కల్యాణ మండపానికి వచ్చి, బ్యాగ్​ను పెళ్లి కుమార్తె బంధువులకు అందజేశాడు. అందరూ కృతజ్ఞతతో ఆటో డ్రైవర్​ వల్లభ్ జోషిపై ప్రశంసల వర్షం కురిపించారు. పూలమాల వేసి సత్కరించారు. ​అతడి నిజాయితీ మెచ్చి నగదు ఇవ్వగా.. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు వల్లభ్​ జోషి.

ఆటో డ్రైవర్​కు పూలమాల వేస్తున్న పెళ్లి కుమార్తె బంధువులు
ఆటో డ్రైవర్​ వల్లభ్​ జోషి

ఇవీ చదవండి :లంబోర్గినిగా మారిన మారుతీ స్విఫ్ట్ సీఎంకు మెకానిక్ కానుక

ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం.. గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details