auto driver killed wife: పోర్న్ చిత్రాలకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యనే కడతేర్చాడు. కర్ణాటకకు చెందిన జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా పోర్న్ చూసేవాడు. రెండు నెలల క్రితం ఓ నీలి చిత్రం చూసిన అతడు.. అందులో కనిపించింది తన భార్యేనని అనుమానించాడు. అప్పటి నుంచి ఆమెతో ప్రతిరోజూ గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో ఆమెను హత్య చేశాడు. తమ పిల్లల ముందే కత్తితో పొడిచి చంపేశాడు.
పోర్న్ చిత్రాల్లో నటించిందని అనుమానం.. భార్య దారుణ హత్య - పోర్న్ వీడియో భార్య హత్య
auto driver killed wife: నీలి చిత్రాల్లో నటించిందని అనుమానించి ఓ వ్యక్తి.. తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. కన్నబిడ్డల ముందే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
బెంగళూరులో నివాసం ఉంటున్న వీరికి.. 15ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదుగురు పిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ తన భార్యపై ఎప్పుడూ ఆరోపణలు చేసేవాడు. రెండు నెలల క్రితం చూసిన పోర్న్ చిత్రంలోని మహిళ.. తన భార్యలాగే ఉండటం వల్ల ఈ దారుణానికి తెగబడ్డాడు. వీడియో చూసిన వెంటనే.. తన భార్యను ఓ కుటుంబ ఫంక్షన్లోనే తీవ్రంగా కొట్టాడు పాషా. 20రోజుల క్రితం కూడా ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ.. ఆస్పత్రిలో చేరిందని పోలీసులు తెలిపారు. మహిళ తండ్రి గౌస్ పాషా తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే దంపతులు రామనగర్కు తమ మకాం మార్చారని.. అంతలోనే నిందితుడు హత్య చేశాడని పోలీసులు వివరించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన పాషా కుమారుడు భయంతో.. వెంటనే తన తాతయ్య ఇంటికి పరిగెత్తుకొని వెళ్లాడని చెప్పారు.
ఇదీ చదవండి: